Amravathi : నేడు అమరావతిలో తొలిసారి
నేడు అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించనున్నారు
నేడు అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలను నిర్వహిస్తారు. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రాయపూడి వద్ద...
ఉదయం 8:30 గంటలకు అమరావతి రాయపూడి దగ్గర జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఏపీ మండలిలో ఉ.8 గంటలకు జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఉ.8:15 గంటలకు ఏపీ అసెంబ్లీలో జెండా ఆవిష్కరణ ఉంటుంది. ఉదయం 10 గంటలకు ఏపీ హైకోర్టు దగ్గర జెండా ఎగరవేయనున్నారు.