మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని చంద్రబాబు అన్నారు.పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని, దాన్ని కూడా సమర్థించుకుంటున్నారంటే ఏం చేయాలని ప్రశ్నించారు. కుప్పానికి హంద్రీనీవా నీరు తెస్తామని డ్రామా ఆడారని, పూర్తి చేయకుండానే వెలిగొండను జాతికి అంకితం చేశానపి.అమరావతి రాజధానిగా అభ్యంతరం లేదన్నారని, తర్వాత మాత్రం అడుగడుగుగా అడ్డుపడ్డారని చంద్రబాబు తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. 2004, 2009లో టీడీపీ గెలిచి ఉంటే ఏపీ మరోలా ఉండేదన్న చంద్రబాబు గుజరాత్ తరహాలో వరుస ఎన్నికల్లో గెలవాలన్నారు.
వరసగా గెలిచి ఉంటే...
ప్రతి రాజకీయ సబ్జెక్టుపై మంత్రులు సిద్ధంగా ఉండాలని, పార్టీ నేతలు కూడా సబ్జెక్టుపై మాట్లాడాలని చంద్రబాబు మంత్రులకు క్లాస్ పీకారు. 1985 నుంచి తాను ఎలా సిద్ధమై మాట్లాడానో మంత్రులకు చంద్రబాబు వివరించారు. రసాయన పదార్థాన్ని నెయ్యిగా చెప్పి లడ్డూలో వాడటాన్ని మంత్రులు తప్పుపట్టారు. తనపేరు తొలగించాలంటూ వైవీ సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించడంపై కూడా ప్రస్తావించారు. వైవీ సుబ్బారెడ్డి పీఏకు డబ్బు చేరిన విషయం కూడా బట్టబయలైందన్న మంత్రులు చేసిన తప్పులు కప్పిపుచ్చుకుని తిరిగి ఎదురుదాడి చేయటం వైసీపీకి అలవాటని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. గొడ్డలి, కోడికత్తి, పరకామణి.. అన్నీ ఇలాగే ఎదురుదాడి చేశారన్న చంద్రబాబు సిట్ నివేదిక ఆధారంగా వాస్తవాలు ప్రజలకు చెప్పాలని సీఎం దిశానిర్దేశం చేశారు.