Nara Lokesh : నారా లోకేశ్ యువగళానికి మూడేళ్లు

టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు పార్టీ నేతలు పెద్దయెత్తున అభినందనలు తెలిపారు

Update: 2026-01-27 06:01 GMT

టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు పార్టీ నేతలు పెద్దయెత్తున అభినందనలు తెలిపారు. ఈరోజు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యదర్శులకు వర్క్ షాపు జరగనుంది. ఈ కార్యక్రమానికి నారా లోకేశ్ హాజరయ్యారు. మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు నాయుడు కూడా పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు.

అభినందనల వెల్లువ...
అయితే నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడేళ్లయిన ఆయనకు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి నారా లోకేశ్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. పాదయాత్ర చేసి మూడేళ్లైన సందర్భంగా లోకేశ్ తో కేక్ కట్ చేయించిన పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.


Tags:    

Similar News