నేడు మంత్రి నారాయణ పర్యటన ఇలా

మంత్రి నారాయణ నేడు రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు

Update: 2026-01-29 04:26 GMT

పురపాలక శాఖ మంత్రి నారాయణ నేడు రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రాజధాని లో చేపట్టాల్సిన గ్రీనరీ పనులపై ఏడీసీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు వెలగపూడి లో గ్రామ సభలో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు వెంకటపాలెం లో గ్రామ సభలో పాల్గొంటారు.

గ్రామసభల్లో...
ఉదయం 10 గంటలకు రాజధాని లో చేపట్టాల్సిన గ్రీనరీ పనులపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించనున్నారు. ఏ మేరకు పనులు పూర్తయ్యాయో ఆయన అడిగి తెలుసుకుంటారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ తీసుకునే క్రమంలో మంత్రి నారాయణ ఈరోజు వెలగపూడి, వెంకటపాలెంలో గ్రామసభలను నిర్వహించనున్నారు. ప్లాట్ల కేటాయింపులపై వారికి పూర్తి వివరాలను అందచేయనున్నారు.


Tags:    

Similar News