Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది. ఉదయం 10.15 గంటలకు సచివాలయానికి చంద్రబాబు రానున్నారుర. ఉదయం 10.30 గంటలకు కేబినెట్ భేటీలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం వివిధ శాఖలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. మూడు గంటలకు గ్రీన్ కవర్‌పై సమీక్ష చంద్రబాబు నిర్వహించనున్నారు.
వివిధ శాఖలపై సమీక్ష...
సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తారు. రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరంతో పాటు ఏ ఏ రైల్వే ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయన్నది అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. చంద్రబాబు నాయుడు సాయంత్రం 6.45 గంటలకు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు