Nara Lokesh : ఎంపీలకు లోకేశ్ ఇచ్చిన టాస్కలివే

పార్లమెంటు సభ్యులతో దాదాపు గంటపాటు విడిగా మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు.

Update: 2026-01-26 03:04 GMT

పార్లమెంటు సభ్యులతో దాదాపు గంటపాటు విడిగా మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. మంత్రులతో పాటు ఎంపీలు పార్టీ ఆఫీసుకు తప్పనిసరిగా రావాలన్నారు. రాష్ట్ర మంత్రితో సమన్వయం చేసుకునేలా ప్రతి ఎంపీకి కొన్ని శాఖలు అప్పగించామన్న లోకేశ్ సంబంధిత శాఖా మంత్రి పార్టీ ఆఫీసుకు వచ్చినప్పుడు కేంద్రంతో సమన్వయం చేసే ఎంపీ కూడా రావాలని తెలిపారు.

ప్రజాదర్బార్ లో పాల్గొంటూ...
ప్రజా దర్బార్ లో ఇద్దరూ పాల్గొనటంతో పాటు శాఖాపరమైన అంశాలపై కేంద్రంతో సమన్వయానికి చర్చించాలని లోకేశ్ ఎంపీలను ఆదేశించారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న ప్రతి రాష్ట్ర సమస్యపై ఎంపీలు అప్ డేట్ గా ఉండాలని, కార్యకర్తలు, ఎమ్మెల్యేల మధ్య బంధం మరింత బలపడేలా కృషి చేయాలని లోకేశ్ పిలుపు నిచ్చార. ఎంపీల పనితీరు ఇంకా మెరుగుపరుచుకోవాలని, పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తూనే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని లోకేశ్ తెలిపారు. కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ఎంపీలు పనిచేయాలని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.


Tags:    

Similar News