Andhra Pradesh : సర్ణాంధ్ర దిశగా ఏపీని తీర్చిదిద్దుతున్నాం

అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి

Update: 2026-01-26 04:37 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తొలుత గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలులోకి తెచ్చామని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేశామని తెలిపారు. సర్ణాంధ్ర దిశగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని అబ్దుల్ నజీర్ తెలిపారు. పేదలను సంపన్నులుగా మార్చడానికి పీ4 పథకాన్ని తెచ్చామని చెప్పారు.

సూపర్ సిక్స్ హామీలను...
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేశామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు ఇస్తున్నామని చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయం కింద అన్నదాత పథకం కింద నిధులను మంజూరు చేస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. పేదలకు పక్కా గృహాలను నిర్మించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. శాంతి భద్రతలకు తమ ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని, పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది పూర్తి చేసి సాగునీరు అందిస్తామని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు.


Tags:    

Similar News