Andhra Pradesh : నేడు టీడీపీ కీలక సమావేశం

తెలుగుదేశం పార్టీ కీలక సమావేశం నేడు జరగనుంది

Update: 2026-01-27 02:51 GMT

తెలుగుదేశం పార్టీ కీలక సమావేశం నేడు జరగనుంది. మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పాల్గొననున్నారు. రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై చర్చించేందుకు ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ నెలాఖరులోగా రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ఈరోజు పార్టీ కార్యదర్శులకు వర్క్ షాపులను నిర్వహించనున్నారు.

పార్టీ కార్యదర్శులకు వర్క్ షాప్...
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు నేతల మధ్య సమన్వయం, కూటమి నేతల మధ్య విభేదాలను తొలగించుకుని ముందుకు వెళ్లడంపై చంద్రబాబు, లోకేశ్ లు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేల విషయంలో ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించాలని కోరనున్నారు.


Tags:    

Similar News