Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ విడుదలయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ విడుదలయింది. నేడు పలు శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు పలుశాఖలపై చంద్రబాబు సమీక్షించనున్నారు. అధికారులతో సమావేశం కానున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో కూడా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు.
మధ్యాహ్నం మూడు గంటలకు...
మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న టీడీపీ వర్క్ షాప్ లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు నేతకు దిశానిర్దేశం చేస్తారు. అలాగే రాష్ట్ర కమిటీ నియామకంపై కసరత్తు చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం 6 గంటలకు క్యాంప్ ఆఫీస్ కు చేరుకోనున్నారు.