మందడంలో నేడు నారాయణ గ్రామసభ
మంత్రి పొంగూరు నారాయణ నేడు సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేడు సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు అమరావతి నిర్మాణంపై సీఆర్డీయే అధికారులతో సమీక్ష చేస్తారు.ఉదయం 10 గంటలకు అమరావతి లో హాస్పిటల్స్,స్కూల్స్ ఏర్పాటుపై VIT,SRM,AMRUTHA యూనివర్సిటీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు.
సీఆర్డీఏ అధికారులతో..
ఉదయం 11 గంటలకు అనంతపురంలో జరిగే మున్సిపల్ శాఖ రీజినల్ సదస్సుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర మంత్రి పెమ్మసాని , ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ,సీఆర్డీయే అధికారులతో సమావేశంలో పాల్గొంటారు.సాయంత్రం 4:30 గంటలకు మందడం లో గ్రామ సభలో పాల్గొంటారు.