Chandrababu : నేడు టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు టీడీపీ కార్యాలయానికి రానున్నారు

Update: 2025-10-18 03:35 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు టీడీపీ కార్యాలయానికి రానున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు చేరుకుంటారు. అక్కడ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు కార్యకర్తలతో కూడా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు.

ప్రజల నుంచి అర్జీలను...
టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు వస్తుండటంతో పెద్దయెత్తున కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చే అవకాశముందని భావించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే కార్యాలయంలోనికి అనుమతిస్తున్నారు. పార్టీ నేతలతో తాజా రాజకీయ పరిణామాలపై కూడా చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశముంది.


Tags:    

Similar News