Kishan Reddy : కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కిషన్ రెడ్డి
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాదిలోనే వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని అధికారం నుంచి దించేందుకు పదేళ్లు పట్టిందన్నకిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.
శాసనమండలి ఎన్నికల్లో...
ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారన్న ఆయన మండలిలో ప్రశ్నించేవారు లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుందని ఆయన ఆరోపించారు. మండలిలో ప్రశ్నించే వారిని ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.