ఎనుమాముల మార్కెట్‌లో మిర్చికి రికార్డు ధర

వరంగల్‌ లోని ఎనుమాముల మార్కెట్‌లో మిర్చికి రికార్డు ధర పలికింది

Update: 2026-02-04 05:34 GMT

మిర్చికి తెలంగాణలో రికార్డు స్థాయి ధర పలికింది. వరంగల్‌ లోని ఎనుమాముల మార్కెట్‌లో మిర్చికి రికార్డు ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చికి ధర పలకడంతో ఈ ఏడాది మిర్చి వేసిన రైతులకు మిర్చి పంటకు అనూహ్యమైన ధర లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

క్వింటాల్ మిర్చికి...
ఎనుమాముల మార్కెట్‌లో క్వింటాల్‌ దేశీమిర్చికి రూ.41,200 ధర పలికింది. గత మూడేళ్లలో దేశీమిర్చికి ఇదే అధిక ధర అని రైతులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ తో పాటు దేశంలో దిగుబడులు తగ్గడం కూడా మిర్చి ధరలకు సరైన ధరలు లభించడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. డిమాండ్ కు తగినంత పంట లేకపోవడం వల్లనే ఈ ధర పలికిందని అంటున్నారు.


Tags:    

Similar News