మేడారం వెళుతున్నారా.. అయితే మీకొక అలెర్ట్

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అంతా సిద్ధమయింది

Update: 2026-01-27 06:41 GMT

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అంతా సిద్ధమయింది. రేపటి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు మేడారం మహా జాతర జరుగుతుంది. ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ మేడారం జాతర ఉంటుంది. దీంతో ఇప్పటికే భక్తులు మేడారానికి చేరి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే భక్తుల ఇబ్బందులు పడకుండా చూసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి...
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భక్తుల సమస్యలను పరిష్కారం చేయడానికి అధికారులు అన్ని సిద్ధం చేశారు. మూడు కోట్ల మంది భక్తులు తరలి వస్తారన్న అంచనాతో ఏఐ టెక్నాలజీ అన్ని రకాలుగా భద్రతా ఏర్పాట్లు చేశారు. మేడారం జాతరకు వెళ్లే దారులను వెడల్పు చేయడంతో పాటు ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మేడారం మహా జాతరకు పదమూడు వేల మంది పోలీసులతో పాటు, ఇరవై ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు అక్కడే ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటారు. చిన్న పిల్లలు తప్పిపోకుండా జియో ట్యాంగింగ్ తో అనుమతించాలని నిర్ణయించారు.


Tags:    

Similar News