తొర్రూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
తొర్రూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది
తొర్రూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాలు పరస్పరం దాడికి చేసుకున్నాయి. తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం పదహారు స్థానాలుండగా అందులో తొమ్మిదింటిలో బీఆర్ఎస్ గెలిచింది. ఏడింటిలో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు కాంగ్రెస్ కు అనుకూలంగా తొమ్మిది ఓట్లు వచ్చాయి. గెలిచిన తొమ్మిది కౌన్సిలర్లతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేరారు.
బీఆర్ఎస్.. కాంగ్రెస్ కార్యకర్తలంటూ...
ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కడియం కావ్య ఎక్స్ అఫిషియో ఓటు వేస్తే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, ఆమె గతంలోనే వరంగల్ కార్పొరేషన్ లో తన ఓటును వినియోగించుకున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు చెబుతున్నారు. మెజారిటీ స్థానాలు తామే గెలిచాం కాబట్టి తమ వారికే ఛైర్మన్ పదవి కల్పించాలంటూ ఎర్రబెల్లి అక్కడే కూర్చుని ధర్నాకు దిగారు. అయితే సభ్యులకు సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమయింది.