తండ్రికుమార్తె సజీవ దహనం

అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు

Update: 2026-03-18 05:49 GMT

అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్పలో బుధవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మృతులను తండ్రి రాజశేఖర్, కుమార్తె రాజశ్రీ గా పోలీసులు గుర్తించారు.

కుటుంబ కలహాల కారణంగానే...
కుటుంబ కలహాల కారణంగా హత్యకు గురయ్యారా? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. సమాచారం అందుకున్న మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. వేలిముద్రలు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరించారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Tags:    

Similar News