వరంగల్ జూలో వైట్ టైగర్ మృతి
వరంగల్ జిల్లా కాకతీయ జూ పార్కులో ప్రధాన ఆకర్షణగా నిలిచిన తెల్లపులి మంగళవారం ఉదయం మృతి చెందింది
వరంగల్ జిల్లా కాకతీయ జూ పార్కులో ప్రధాన ఆకర్షణగా నిలిచిన తెల్లపులి మంగళవారం ఉదయం మృతి చెందింది. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ పులికి హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్లు చికిత్స అందించినప్పటికీ, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా హార్ట్ స్ట్రోక్ వచ్చి మరణించినట్లు అధికారులు తెలిపారు.
గత ఏడాది జులైలో...
గత ఏడాది జూలైలో ఈ పులిని వరంగల్ జూకు తీసుకువచ్చారు. అయితే పులి అనారోగ్యానికి గురి కావడంతో జూ అధికారులు వెటర్నరీ వైద్యులను రప్పించి దానిని బతికించేందుకు చివర వరకూ ప్రయత్నించారు. అయితే తెల్లపులి మరణించింది. తెల్లపులి హార్ట్ స్ట్రోక్ తో మరణించిందని, జూ సందర్శకులకు ఇది విషాదకరమైన వార్త అని చెప్పారు.