నేటి నుంచి మేడారంలో హెలికాప్టర్ సేవలు

నేటి నుంచి మేడారంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభం కానున్నాయి

Update: 2026-01-23 05:02 GMT

నేటి నుంచి మేడారంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభం కానున్నాయి. మేడారం జాతర సందర్భంగా హెలికాప్టర్ సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఎలుబాక నుంచి మేడారం ఏరియల్ వ్యూ వీక్షించే అవకాశం ఉంది. జాయ్ రైడ్ లను నేటి నుంచి ప్రారంభం కానుండటంతో మేడారం వచ్చే భక్తులు వీటిని ఉపయోగించుకోవచ్చు. జాయ్ రైడ్ సేవలను మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు.

జాయ్ రైడ్ కు...
జాయ్ రైడ్ కు ఒకరికి ఐదు వేల రూపాయలు ఛార్జి వసూలు చేయనున్నారు. హనుమకొండ నుంచి మేడారం జాతరకు వెళ్లాలంటే ఒక్కొక్కరికి 35,999 రూపాయలు వస్తూలు చేస్తారు. ఈ అవకాశాన్ని మేడారం జాతరకు వచ్చే భక్తులు ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మేడారం జాతరకు వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.


Tags:    

Similar News