Revanth Reddy : నేడు ములుగు జిల్లాకు రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2026-02-22 04:11 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రేవంత్ రెడ్డి ములుగు జిల్లాకు వెళ్లి దేవాదుల ప్రాజెక్టును పరిశీలిస్తారు. దేవాదుల ప్రాజెక్టును వీలయినంత త్వరగా పనులు పూర్తి చేసి రైతులకు సాగు నీరందించే కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దేవాదుల ప్రాజెక్టు పరిశీలన...
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దేవాదుల ప్రాజెక్టు కు వెళ్లి అక్కడ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించనున్నారు. దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇంజినీర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ి సమావేశమవుతారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News