Medaram : మేడారానికి పోటెత్తిన భక్తులు
మేడారానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు
మేడారానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. వరస సెలవులు రావడంతో భక్తులు అనేక మంది తరలి రావడంతో మేడారం రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మేడారం జాతరకు వచ్చిన భక్తులు గద్దెల వద్ద పూజలు నిర్వహించి ప్రత్యేక మొక్కులు నెరవేర్చుకుంటున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది.
మూడు కోట్ల మంది...
మేడారం జాతరకు ఈ నెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ దాదాపు మూడు కోట్ల మంది భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి పనులను పూర్తి చేసిన అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మేడారం వెళ్లే దారిలో అనేక వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.