ఇంటిపన్ను చెల్లించలేదని గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లి

ఇంటి ప‌న్ను చెల్లించలేద‌ని అధికారులు గ్యాస్ సిలిండ‌ర్ ఎత్తుకెళ్లారు

Update: 2026-03-11 11:55 GMT

ఇంటి ప‌న్ను చెల్లించలేద‌ని అధికారులు గ్యాస్ సిలిండ‌ర్ ఎత్తుకెళ్లారు. వరంగల్ న‌గ‌రం కాశీబుగ్గలో ఘటన వెలుగుచూసింది. ఇంటి పన్ను చెల్లించ లేదని పేద మ‌హిళ సిలిండ‌ర్ ను అధికారులు తీసుకెళ్లారు. గ‌త నెల 23న గొలుసుల సుజాత అనే మహిళ‌కు ఇంటిపన్ను చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆమె సకాలంలో ఇంటిపన్ను చెల్లించలేదు.

అప్పు చేసి చెల్లించడంతో...
త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు లేక‌పోవ‌డంతో ఇంటి ప‌న్ను సుజాత‌ చెల్లించలేదు. దీంతో ఇంటికి వచ్చిన మున్సిపల్ అధికారులు గ్యాస్ సిలిండ‌ర్ ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం గ్యాస్ సంక్షోభం తలెత్తిన సమయంలో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చేసేది ఏమీలేక అప్పు చేసి తాను చెల్లించాల్సిన 5,280 రూపాయల పన్నును మ‌హిళ సుజాత‌ చెల్లించింది. దీంతో త‌ర్వా త సాయంత్రానికి గ్యాస్ సిలిండ‌ర్ అధికారులు తెచ్చి ఇచ్చారు.


Tags:    

Similar News