తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2026-02-12 04:21 GMT

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. .వెయ్యి కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో మెగా ఫ్రైట్ ఎగ్జామినేషన్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.ఇందుకు వెయ్యి కోట్ల రూపాయలు వ్యయం అవుతాయని అంచనా వేసింది. .వెయ్యి కోట్లతో గూడ్స్ రైలు వ్యాగన్లను రిపేర్ చేసే ఈ ప్రాజెక్టును తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది.

వరంగల్ కు వరం...
తెలంగాణ లో రైల్వే వ్యవస్థను మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా వరంగల్ జిల్లాలో గూడ్స్ రైలు వ్యాగన్ల రిపేర్ కోసం ఒక మెగా ఫ్రైట్ ఓవర్ హాలింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది రాష్ట్రంలోనే తొలి స్టేషన్ కావడం విశేషం. దీంతో తెలంగాణలోని వరంగల్ లో ఎప్పటి నుంచో కోరుకుంటున్న గూడ్స్ రైలు వ్యాగన్ల మరమ్మతుల కేంద్రం రానుంది.


Tags:    

Similar News