Telangana : నేడు ములుగు జిల్లాలో గవర్నర్ పర్యటన

తెలంగాణలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2025-03-11 01:59 GMT

తెలంగాణలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ములుగుజిల్లాలోని తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామానికి ఆయన వెళ్లనున్నారు. కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకున్న నేపథ్యంలో ఆయన ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి చర్చించనున్నారు.సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

దత్తత తీసుకున్న...
ఈ సందర్భంగా కొండపర్తి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు. తర్వాత గ్రామస్థులతో గవర్నర్ ప్రత్యేకంగా సమావేశమై ఆ ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై చర్చిస్తారు. తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మదర్శించుకోనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ములుగు జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News