Revanth Reddy : నేడు వరంగల్ కు రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లా పర్యటనకు వెళుతున్నారు.

Update: 2025-10-15 02:22 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లా పర్యటనకు వెళుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్ కు చేరుకుంటారు. పార్టీ నేత, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇటీవల ఆమె మరణించడంతో మాధవిరెడ్డి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శిస్తారు.

నేతలతో మాట్లాడిన....
వడ్డేపల్లిలోని పీజీఆర్ గార్డెన్స్ లో ఈ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 1.45 గంటల వరకూ ఈ కార్యక్రమంలో ఉండనున్నారు. అలాగే అక్కడి నేతలతో మాట్లాడతారు. అనంతరం బయలుదేరి తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని చర్యలు చేపట్టారు.


Tags:    

Similar News