Revanth Reddy :నేడు వరంగల్ కు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ కు బయలుదేరి వెళ్లనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ కు బయలుదేరి వెళ్లనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. మొంథా తుపాను ప్రభావం వరంగల్, హనుమకొండ, కాజీపేట పట్టణాలపై తీవ్ర ప్రభావం చూపింది. అనేక కాలనీలు నీటమునిగాయి. ఇప్పటికీ వరంగల్ నగరంలో వరద నీరు ఉంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో...
దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు హనుమకొండకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ప్రధానంగా నీటి ముంపునకు గురైన సమ్మయ్యనగర్, కాపువాడ ప్రాంతాలను పరిశీలిస్తారు. అనంతరం కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. బాధితులకు పరిహారం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశముంది.