వరంగల్ లో ప్రపంచ సుందరీ మణులు

మిస్ వరల్డ్ పోటీ దారులు వరంగల్ నగరంలో పర్యటించారు

Update: 2025-05-14 13:32 GMT

మిస్ వరల్డ్ పోటీ దారులు వరంగల్ నగరంలో పర్యటించారు. కొద్దిసేపటి క్రితం వరంగల్ కు వచ్చిన అందాల భామలకు ఘనస్వాగతం లభించింది. వేయి స్థంభాల గుడి, రామప్ప దేవాలయాలను సందర్శించారు. అక్కడి శిలానైపుణ్యం చూసి వారు అచ్చెరువొందారు. కాకతీయ వారసత్వ సంపదను సందర్శించేందుకు యాభై ఏడు దేశాలకు చెందిన ప్రపంచ సుందరీమణులు వరంగల్ కు చేరుకున్నారు.

సంప్రదాయ దుస్తుల్లో...
వరంగల్ లోని హరిత కాకతీయ హోటల్ కు చేరుకున్న తర్వాత వారికి బతుకమ్మ ఆటలతో పాటు తెలంగాన సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులు ఘన స్వాగతం పలికారు. రెండు బృందాలుగా విడిపోయి వారు వరంగల్ లో పర్యటించారు. 22 మంది వేయి స్థంభాల గుడిని, 35 మంది రామప్ప దేవాలయాన్నిసందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వారు దర్శించుకోవడం విశేషం.


Tags:    

Similar News