Heavy Rain : వరంగల్ లో భారీ వర్షం.. చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు
వరంగల్ లో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో నగరంలోని అన్ని రహదారులు జలమయమయ్యాయి.
వరంగల్ లో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో నగరంలోని అన్ని రహదారులు జలమయమయ్యాయి. అండర్ బ్రిడ్జి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకుపోయాయి. ఆదివారం కావడంతో ప్రజలు ఎవరూ బయటకు రావలేదు. వరంగల్ లో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపారు.
అకాల వర్షంతో...
అకాల వర్షంతో కాలనీల్లోకి నీరు చేరింది. దుకాణాల వద్దకు కూడా వర్షపు నీరు చేరడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కొందరు వాహనదారులు వర్షపు నీటిలో చిక్కుకుపోయారు. ఒక్కసారిగా ఉదయం మొదలయిన వర్షం దాదాపు రెండు గంటల పాటు ఏకధాటిగా కురవడంతో నగర వీధులన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.