Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు
వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మామునూరు హైవే పై ఈ ప్రమాదం జరిగింది. ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి ఆటోలపై పడటంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, కొందరు గాయపడ్డారు.
లారీ అదుపు తప్పి...
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని లారీని పక్కకు జరిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి గల కారణంగా తెలుస్తుంది. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఎవరన్నది తెలియాల్సి ఉంది.