KTR : నేడు వరంగల్ కు కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. హనుమకొండలో దీక్షాదివస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకూ దీక్షాదివస్ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు కేటీఆర్ హనుమకొండ, వరంగల్ జిల్లాల ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశం కానున్నారు. వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
హనుమకొండలో జరగనున్న...
హనుమకొండలో జరగనున్న ఈ కార్యకర్తల సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి రావాలని పార్టీ నేతలు కోరారు. ఇప్పటికే హనుమకొండకు కార్యకర్తలు చేరుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా కేటీఆర్ వరంగల్ జిల్లా పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.