KTR : నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2025-12-27 04:32 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులతో కేటీఆర్ సమావేశం కానున్నారు. మహబూబాబాద్ లోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

సర్పంచ్ లతో సమావేశం...
ప్రభుత్వం విడుదల చేసే నిధులతో గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని, అలాగే ఎన్నికల్లో గెలిచిన వారు తాము ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విధంగా వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం అవసరమైతే న్యాయపోరాటం, ప్రజాపోరాటం చేయాలని కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునివ్వనున్నారు.


Tags:    

Similar News