Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.

Update: 2025-10-31 04:02 GMT

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పెళ్లి బృందం వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. హనుమకొండ జిల్లా ఎల్కుతుర్తి మండలం గోపాలపురం క్రాస్ రోడ్ వద్ద హైవే పై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పెళ్లి బృందం వాహనాన్ని...
సిద్ధిపేట జిల్లా నంగూనూరు మండలం వెంకటాపురం గ్రామంలో పెళ్లి వేడుక జరుపుకుని తిరిగి మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదన్ పల్లికి వస్తుండగా పెళ్లి బృందం ప్రమాదానికి గురయింది. బోలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు మరణించారు. గాయపడిన వారిని వరంగల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు


Tags:    

Similar News