Ys Jagan : విశాఖకు చేరుకున్న వైఎస్ జగన్

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ విశాఖపట్నం చేరుకున్నారు.

Update: 2025-10-09 06:04 GMT

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ విశాఖపట్నం చేరుకున్నారు. నర్సీపట్నం లోని మెడికల్ కళాశాలను పరిశీలించేందుకు విశాఖకు చేరుకున్న జగన్ కు పార్టీ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా జగన్ నర్సీపట్నం వెళ్లనున్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్ ను మధ్యలో కలవనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తమకు అండగా నిలవాలని స్టీల్ కార్మిక సంఘాలు జగన్ ను కలసి విజ్ఞప్తి చేయనున్నాయి.

రోడ్డు మార్గం ద్వారా...
అస్వస్థతకు గురై విశాఖపట్నంలోని కేజీహెచ్ లోని గిరిజన విద్యార్థులను కూడా జగన్ పరామర్శించనున్నారు. పెందుర్తి, అనకాపల్లి, తాళ్లపాలెం మీదుగా వైఎస్ జగన్ నర్సీపట్నం చేరుకుంటారు. అయితే పోలీసుల నిబంధనలు అనుసరించి జగన్ పర్యటన కొనసాగుతుందని ఇప్పటికే వైసీపీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారీగా వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకుంటున్నారు. నక్కపల్లికి చెందిన మత్స్యకారులు కూడా జగన్ ను కలిసేందుకు అక్కడకు చేరుకోగా అనుమతి లేదని పోలీసులు నిరాకరించారు.


Tags:    

Similar News