Bhogapuram : తొలి విమానం దిగింది.. పూర్తి స్థాయిలో ఎప్పుడంటే?
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టుకు తొలి విమానం చేరుకుంది
ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమయింది. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టుకు తొలి విమానం చేరుకుంది. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం దిగడంతో ఆ ప్రాంత వాసులు హర్షాతి రేకాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాలిడేషన్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి విమానం రాగానే భారీ స్వాగతం లభించిందది. ముందు రోజు నుంచి భోగాపురం ఎయిర్ పోర్టులో ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు, రన్ వేతో పాటు విమానం ల్యాండ్ కావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు.తొలిసారి భోగాపురం విమానశ్రయానికి వచ్చిన వ్యాలిడేట్ విమానంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ ఛైర్మన్ లు కూడా వచ్చారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో...
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించారు. దాదాపు 96 శాతం నిర్మాణ పనుల పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా పూర్తయితే జూన్ 26వ తేదీ నుంచి విమానాశ్రయం అందరికీ అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు. మరొకవైపు ఈ విమానాశ్రయాన్ని జీఎంఆర్ సంస్థ నిర్మిస్తుంది. ఈ విమానాశ్రయం ద్వారా దేశంలోనే అత్యున్నత ప్రమాణాలున్నదిగా గుర్తించబడుతుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. మరొకవైపు భూ సేకరణ నుంచి అన్ని రకాలుగా ఇబ్బందులు పడినా ఎలాంటి అవాంతరాలు లేకుండా విమానాశ్రయాన్ని నిర్మించడంతో చుట్టు పక్కల రియల్ ఎస్టేట్ కూడా ఇప్పటికే ఊపందుకుంది. ఈ విమానాశ్రయం ఏర్పాటయిన తర్వాత ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.