నేడు భోగాపురం ఎయిర్ పోర్టుకు విమానం
భోగాపురం ఎయిర్ పోర్టుకు నేడు విమానం చేరుకోనుంది
భోగాపురం ఎయిర్ పోర్టులో ట్రయల్ రన్‍కు ఏర్పాట్లు పూర్తయింది. ఈరోజు ఉదయం 11 గంటలకు భోగాపురానికి వ్యాలిడేషన్ ఫ్లైట్ చేరుకోనుంది. ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్ ఇండియా విమానం రానుంది. విమానంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, డీజీసీఏ అధికారులు రానున్నారు. ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమయ్యేలా ఈరోజు భోగాపురం ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ కానుంది.
జూన్ కంటే ముందుగానే...
జూన్ కంటే ముందే అందుబాటులోకి ఎయిర్ పోర్టు రానుందని అధికారులు తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్టులో 96 శాతం పనులు పూర్తయ్యాయని, అనుకున్న సమయానికి ముందే వినియోగంలోకి రావడంతో ఉత్తరాంధ్ర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.