నేడు విశాఖలో వైసీపీ ఆందోళన
వైసీపీ నేతలు నేడు విశాఖపట్నంలో నిరసన తెలియజేయనున్నారు
వైసీపీ నేతలు నేడు విశాఖపట్నంలో నిరసన తెలియజేయనున్నారు. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీకి భూములు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ జీవీఎంసీ ఎదుట గాంధీ విగ్రహం ఎదుట నిరసన దీక్ష చేయనున్నారు. గీతం యూనివర్సిటీకీ యాభై ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా గీతం యూనివర్సిటీకి అప్పగిస్తున్నారంటూ నిరసన చేపట్టనున్నారు.
గీతం భూములకు...
గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించి అక్కడే నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఈరోజు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగనుంది. గాంధీ విగ్రహం నుంచి నేరుగా సమావేశం మందిరం వరకూ ర్యాలీ కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో భారీగా పోలీసులు బందోబస్తు ను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించారు.