విశాఖ కౌన్సిల్ సమావేశంలో రగడ

జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది

Update: 2026-01-30 07:27 GMT

జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కూటమి, వైసీపీ సభ్యులు ఘర్షణకు దిగారు. గీతం యూనివర్సిటీకి యాభై నాలుగు ఎకరాల భూమిని అప్పగించడాన్ని నిరిసిస్తూ కౌన్సిల్ లో వైసీపీ మేయర్ ను అడ్డుకుంది. కమ్యునిస్టులు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. దీంతో పాటు కౌన్సిల్ బయట కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గీతం భూముల కేటాయింపుపై...
మీడియాను లోపలికి పంపాలంటూ వామపక్షాలు ఆందోళన దిగాయి. మీడియా లేకుండా చీకటి ఒప్పందాలతో కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తారా అంటూ నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా.... పత్రిక స్వేచ్ఛను హరిస్తారా... అంటూ ప్రశ్నించారు. ఎంపీ కి ప్రజలు ఓట్లేసి గెలిపించింది వేలకోట్ల రూపాయల భూములు దోచుకోవడానికా... అంటూ వామపక్ష కార్యకర్తలు గేట్లను చూసుకుంటూ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు... పోలీసులు వారిని నియంత్రణ చేస్తూ తోపులాట చోటుచేసుకుంది.


Tags:    

Similar News