ఏజెన్సీ ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. దట్టంగా పొగమంచు అలుముకుంది. అరకులో 7, మినుములూరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పాడేరు, చింతపల్లిలో పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయిందని అధికారులు వెల్లడించారు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
పెరిగిన పర్యాటకులు...
మరొకవైపు పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు కూడా పొగమంచు వీడకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లైట్లు వేసుకుని చిన్నగా వస్తున్నారు. మరొకవైపు చలి, పొగమంచు ఉండటంతో పాటు ఆదివారం కావడంతో మాడగడ, వంజంగి మేఘాల కొండకు పర్యాటకుల తాకిడి పెరిగింది.