జడలో చోరీ బంగారం.. దొరికిపోయారుగా
విశాఖ జిల్లా గాజువాక బీసీ రోడ్డులోని జ్యువలరీ' షాపులో వింత దొంగతనం వెలుగుచూసింది
విశాఖ జిల్లా గాజువాక బీసీ రోడ్డులోని 'ఓం జ్యువలరీ' షాపులో వింత దొంగతనం వెలుగుచూసింది. బంగారం కొనడానికి వచ్చిన ముగ్గురు మహిళలు, చాకచక్యంగా నగలను దొంగిలించి ఎవరికీ అనుమానం రాకుండా తమ జడల్లో దాచుకున్నారు. అయితే, వారి కదలికలను గమనించిన షాప్ యజమాని వెంటనే అప్రమత్తమై వారిని పట్టుకున్నారు.
కొనటానికి వచ్చి...
బంగారం కొనుగోలు చేయడానికి అని జ్యుయలరీ దుకాణానికి వచ్చి బేరమాడుతూ చాకచక్యంగా దొంగతనానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న గాజువాక క్రైమ్ పోలీసులు నిందితులు భోజ నాగమణి, బోజగాని జ్ఞానమ్మ, పొన్నా పద్మలను అదుపులోకి తీసుకుని, వారి జడల్లో దాచిన బంగారాన్ని రికవరీ చేశారు. ప్రస్తుతం వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.