Pawan Kalyan : నేటి నుంచి పవన్ విశాఖ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు విశాఖ జిల్లాలో ఆయన పర్యటన కొనసాగుతుంది. మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ విశాఖ జిల్లాలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. స్థానిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ప్రజల నుంచి వినతులను...
ప్రజల నుంచి వినతి పత్రాలను పవన్ కల్యాణ్ స్వీకరించనున్నారు. పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత విశాఖపట్నం వస్తుండటంతో భారీగా స్వాగతం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లను స్థానిక నేతలు చేపట్టారు. విమానాశ్రయం నుంచి ఆయనకు స్వాగతం పలకనున్నారు. అలాగే అభిమానులు పెద్దయెత్తున తరలి వస్తారని భావించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.