అనకాపల్లి జిల్లాలో టీడీపీ vs జనసేన
అనకాపల్లి జిల్లా మదీనా గ్రామంలో టీడీపీ, జనసేన వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.
అనకాపల్లి జిల్లా మదీనా గ్రామంలో టీడీపీ, జనసేన వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామంలో ప్రభుత్వ భూమిని సోలార్ ప్లాంట్ కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనకు దిగారు. గ్రామ సభను నిర్వహించకుండానే ప్రభుత్వ భూమిని సోలార్ ప్లాంట్ ను కేటాయించడంపై రెండు వర్గాలు రెండు అభిప్రాయాలతో ఆందోళనకు దిగాయి. అయితే ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.
ఘర్షణకు దిగడంతో...
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని వారు ఆరోపించారు. అక్కడ చెట్లు కొట్టాలని జనసేన కార్యకర్తలు, కొట్ట వద్దంటూ టీడీపీ కార్యకర్తలు ఒకరికొకరు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి ఇరువర్గాలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు.