నేడు వైసీపీ నేతలు గీతం భూముల పరిశీలన

విశాఖపట్నంలో నేడు వైసీపీ నేతలు గీతం విద్యా సంస్థల భూములను పరిశీలించనున్నారు

Update: 2026-01-29 03:24 GMT

విశాఖపట్నంలో నేడు వైసీపీ నేతలు గీతం విద్యా సంస్థల భూములను పరిశీలించనున్నారు. గీతం విద్యాసంస్థలు ఆక్రమించుకున్న భూములను క్రమబద్ధీకరించుకునే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ఈ యాత్రను చేపట్టింది. విశాఖలో అతి విలువైన ప్రభుత్వ భూములను గీతం విద్యాసంస్థల యాజమాన్యం ఆక్రమించుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఆక్రమణకు గురయ్యాయని...
దీంతో నేడు గీతం భూములను వైసీపీ నేతలను పరిశీలించనున్నారు. విశాఖలో పెద్దయెత్తున భూ దోపిడీ జరుగుతుందని వైసీపీ ఆరోపిస్తుంది. గీతం విద్యాసంస్థలకు ప్రభుత్వ భూములను అప్పనంగా దోచిపెడుతున్నారని విమర్శిస్తుంది. రేపు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ నిరసనను తెలియజేయనుంది. అయితే పోలీసులు మాత్రం వీరి పర్యటనకు అనుమతించలేదు.


Tags:    

Similar News