నేటి నుంచి విశాఖ ఉత్సవ్

నేటి నుంచి విశాఖ ఉత్సవ్ నిర్వహించనున్నారు.

Update: 2026-01-24 03:14 GMT

నేటి నుంచి విశాఖ ఉత్సవ్ నిర్వహించనున్నారు. ఈనెల 31వ తేదీ వరకూ విశాఖ ఉత్సవ్ కార్యక్రమం జరగనుంది. ఆర్కే బీచ్, రుషికొండ, భీమిలీ బీచ్ లలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఏటా విశాఖ ఉత్సవ్ కార్యక్రమాలను జనవరి నెలలో నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు హాజరు కానున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు...
సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అనేక వినోద కార్యక్రమాలను కూడా ఈ విశాఖ ఉత్సవ్ లో ఏర్పాటు చేస్తారు. ఈరోజు సాయంత్రం జరగనున్న ప్రారంభ వేడుకకు మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, కందుల దుర్గేష్ లు హాజరుకానున్నారు. విశాఖ ఉత్సవ్ లో వినోద కార్యక్రమాలతో పాటు పలు రకాల ఫుడ్ స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.


Tags:    

Similar News