Andhra Pradesh : నేడు హోం మంత్రి ఇలాకాలో వైసీపీ ఆందోళన
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గంలో నేడు వైసీపీ ఆందోళనకు దిగనుంది
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గంలో నేడు వైసీపీ ఆందోళనకు దిగనుంది. నేడు వైసీపీ నేతలు చలో రాజయ్యపేటకు పిలుపు నిచ్చారు. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు గత కొద్ది రోజుల నుంచి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నేడు వైసీపీ వారికి మద్దతు తెలిపిందేకు రాజయ్యపేటకు వెళ్లనుంది. శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతలు నేడు రాజయ్య పేటకు వెళ్లనున్నారు.
షరతులతో కూడిన అనుమతి...
అయితే వైసీపీ నేతల పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఈరోజు ఆ నియోజకవర్గంలో టీడీపీ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపట్టింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశముందని భావించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి ఇచ్చాం కదా? అని ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.