Breaking : విశాఖ జిల్లా కోర్టు సంచలన తీర్పు...నిందితుడికి ఉరిశిక్ష
విశాఖ జిల్లా కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఆరుగురిని హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
విశాఖ జిల్లా కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఆరుగురిని హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పెందుర్తిలో ఒకే కుటుంబంలోని ఆరుగురిని అప్పలరాజు అనే నిందితుడు హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్య కు సంబంధించిన ఆధారాలను సేకరించి నిందితుడిని అరెస్ట్ చేసింది. అప్పలరాజు రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
2021లో జరిగిన...
2021 ఏప్రిల్ 20న పెందుర్తి మండలంలోని జుత్తాడలో ఈ ఘటన జరిగింది. దాదాపు ఐదేళ్లపాటు విచారించిన న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది. ఈ ఘటనలో నిందితుడు అప్పలరాజు తరుపున న్యాయవాదుల వాదనతో పాటు ప్రభుత్వం తరుపున న్యాయవాదులు కూడా వాదించారు. నిందితుడు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేయడంతో కేసుకు సంబంధించిన అన్నిఆధారాలను పోలీసులు న్యాయస్థానానికి సమర్పించింది. వాదనలు విన్న జిల్లా కోర్టు చివరకు నిందితుడు అప్పలరాజుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.