YSRCP : విశాఖ భూములను తండ్రీ కొడుకులు దోచుకుంటున్నారు

విశాఖలో భూకేటాయింపులు పెద్ద కుంభకోణమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అన్నారు

Update: 2025-12-20 08:09 GMT

విశాఖలో భూకేటాయింపులు పెద్ద కుంభకోణమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములను తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్ లు తమ జాగీరుగా భావిస్తున్నారని అన్నారు. అమరావతిలో కోట్ల రూపాయలు ఎకరానికి ఇచ్చే భూములు విశాఖకు వచ్చేసరికి యాభై లక్షల రూపాయలకే ఎందుకు ఇస్తున్నారని గుడివాడ అమర్నాధ్ ప్రశ్నించారు.

99పైసలకే ఎకరమా?
ఉమ్మడి విశాఖపట్నంలో కేటాయించే భూములకు 99 పైసలకే ఎకరాకు ఇవ్వమేంటని నిలదీశారు. ఇందులో ఏదో జరుగుతుందని గుడివాడ అమర్నాధ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ భూములను ఇలా అప్పనంగా పంచుకుంటూ వెళితే ఎలా అని గుడివాడ అమర్నాధ్ ప్రశ్నించారు. ఇటీవల న్యాయస్థానం కూడా భూ కేటాయింపులపై ప్రశ్నించడాన్ని గుడివాడ అమర్నాధ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.


Tags:    

Similar News