Chandrababu : నేడు అనకాపల్లికి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2025-12-20 02:19 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. కశింకోట మండలం తాళ్లపాలెంలో జరగనున్న స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈరోజు అనకాపల్లికి చేరుకోనున్న చంద్రబాబు అక్కడ వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. వాజపేయి - మోదీ సుపరిపాలన యాత్ర సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ జరగనుంది.

స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో...
ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డు మార్గాన అనకాపల్లికి బయలుదేరి వెళతారు. అక్కడ స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడతారు. అక్కడ జరిగే సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడతారు. చంద్రబాబు రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా కూటమి పార్టీల నేతలు ఈ కార్యక్రమాలకు హాజరు కానున్నారు.


Tags:    

Similar News