BJP : రుషికొండ ప్యాలెస్ ను స్టార్ హోటల్ కు ఎలా ఇస్తారు?

బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు రుషికొండ ప్యాలెస్ పై మంత్రుల కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు

Update: 2025-12-25 07:42 GMT

బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు రుషికొండ ప్యాలెస్ పై మంత్రుల కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ఆరేళ్లుగా రుషికొండను మూసేశారన్నారు. ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకోవడం మంచిదని విష్ణుకుమార్ రాజు సూచించారు.

ఆధ్మాత్మిక కేంద్రంగా...
స్టార్ హోటల్ కు రుషికొండ ప్యాలెస్ ఇచ్చేకన్నా ఆధ్మాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. వేల రూపాయలు డబ్బులు పెట్టి అక్కడ ఎవరు తింటారని ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా రుషికొండ ప్యాలెస్ ను ఉపయోగించాలని ఆయన కోరారు. మంత్రుల కమిటీ కేవలం స్టార్హటల్ కు ఇస్తామని చెప్పడం అర్థరహితమని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు.


Tags:    

Similar News