ఎలమంచిలి రైలు ప్రమాదంపై విచారణ ప్రారంభం

ఎలమంచిలి రైలు ప్రమాదంపై రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించింది

Update: 2025-12-29 04:43 GMT

ఎలమంచిలి రైలు ప్రమాదంపై రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. అర్ధరాత్రి టాటా ఎక్స్ ప్రెస్ రైలులో రెండు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగడంతో ఒకరు మరణించారు. దీంతో రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో ఈరోజు ఉదయం ఫోరెన్సిక్‌ బృందం సంఘటన ప్రాంతానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించింది.మంటలు రావడానికి గల కారణాలను విశ్లేషించనుంది.

మంటలు రావడానికి...
దగ్ధమైన B1, B2 బోగీల నుంచి ఫోరెన్సిక్‌ నిపుణులు క్లూస్‌ సేకరిస్తున్నారు. రెండు బోగీల వీడియోగ్రఫీ చేసిన ఫోరెన్సిక్‌ బృందం రైల్వే శాఖ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనుంది. ఆర్పీఎఫ్, జీఆర్పీ, రైల్వే అధికారులతో ఆర్ఎఫ్ఎస్ఎల్ ఏడీ గీతామాధురి మాట్లాడారు. బోగీలో అగ్నిప్రమాదం కారణంగా ప్రెషర్‌ డ్రాప్‌ కావడంతో ఆటోమేటిక్‌గా బ్రేక్స్‌ పడి రైలు ఆగిందని లోకో పైలట్‌ చెబుతున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది.


Tags:    

Similar News