Andhra Pradesh : ఏపీ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ను ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ను ప్రకటించింది. జనవరి4వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానశ్రయంలో తొలి కమర్షియల్ ఫ్లైట్ ల్యాండ్ కానుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరాంధ్ర వాసులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న భోగాపురం ఎయిర్ పోర్టు వచ్చే ఏడాది ఆరంభంలోనే అందుబాటులోకి రానుంది.
అంతర్జాతీయ విమానాశ్రయంగా...
2026 జూన్ నెల నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తిగా అందుబాటులోకి రానుందని పౌర విమానయాన శాఖ ప్రకటించింది. జనవరి 4వ తేదీన కమర్షియల్ ఫ్లైట్ ల్యాండింగ్ కార్యక్రమానికి కేంద్ర మత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ విమానాల రాకపోకలు కూడా ప్రారంభం కానున్నాయి.