Visakha : విశాఖ మున్సిపల్ డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు

విశాఖ డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది.

Update: 2025-05-19 05:55 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. ఈ మేరకు సీల్డ్ కవర్ లో పార్టీ నాయకత్వం పేరును కూడా పంపింది. జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పేరును ఖరారు చేసింది. మేయర్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపిక కావడంతో డిప్యూటీ మేయర్ పదవిని తమకు ఇవ్వాలని జనసేన పార్టీ పట్టుబట్టింది.

అభ్యర్థిగా గోవిందరెడ్డి...
దీంతో టీడీపీ కూడా అందుకు అంగీకరించింది. అయితే దల్లి గోవిందరెడ్డి పేరును డిప్యూటీ మేయర్ పదవికి ఎంపిక చేయడంతో ఎంపిక నామమాత్రం అయింది. టీడీపీ నుంచి కూడా అనేక మంది ఈ పదవికి పోటీ పడ్డారు. అయితే చిట్టచివరకు జనసేన పార్టీయే డిప్యూటీ మేయర్ పదవిని తీసుకోవాలని నిర్ణయం జరిగిపోయింది. మారికాసేపట్లో గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎంపిక కానున్నారు.


Tags:    

Similar News